పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్‌ పరామర్శ

పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్‌ పరామర్శ 



సాక్షి, యానాం: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి కేంద్రపాలిత ప్రాంతం యానాం వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కొమానపల్లిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సభ అనంతరం అక్కడి నుంచి గాడిలంక చేరుకుని, హెలికాప్టర్‌లో యానాంలోని రాజీవ్‌గాంధీ బీచ్‌ వద్దకు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పరిపాలనాధికారి శివరాజ్‌మీనా, ఎస్పీ రచనాసింగ్‌ తదితర అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి సీఎం జగన్‌ కారులో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు గృహానికి చేరుకున్నారు. ఆయన్ను మంత్రి కృష్ణారావు సాదరంగా ఆహ్వానించారు.