నయనతార తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. అయితే నయయనతార సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు కలిసి అమెరికాలో తమ స్నేహితులతో కలిసి ఉత్సాహంగా గడిపిన ఫోటోలను విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. డెనిమ్ బ్లూ షర్ట్, బ్లాక్ లెదర్ స్కర్ట్, లూస్ హెయిర్‌తో ఉన్న నయన్ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేగాక విఘ్నేష్, నయన్‌లు తమ స్నేహితులతో గడిపిన క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు.
విఘ్నేష్‌కు థ్యాంక్స్ చెప్పిన నయయతార